ఇందిరాగాంధీ వర్ధంతి, వల్లభయ్ పటేల్ జయంతి కార్యక్రమం
టీ మీడియా ,అక్టోబర్ 31, నారాయణఖేడ్:
శనివారం ఇందిరాగాంధీ వర్ధంతి పురస్కరించుకొని ఎమ్మెల్యే స్వగృహం లోని ఆయన నివాసంలో, దేశ ప్రజలకు ఆమె అందించిన సంక్షేమాని స్మరించుకుంటూ ఆమె చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బోజిరెడ్డి జిల్లా నాయకులు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ పేదలకు సంక్షేమం, అభివృద్ధిని దగ్గరికి చేసి ప్రజల గుండెలో పదిలంగా నిలిచిపోయారని తెలిపారు. ఆనాడు ఆ మహానేత ముందు చూపుతో చేపట్టిన సంక్షేమ పథకాల ఫలితంగా దేశం అభివృద్ధిలో దూసుకు పోతుందన్నారు. ఇందిరమ్మ పాలన స్ఫూర్తితో తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పాలన కొనసాగిస్తూ అన్ని వర్గాలకు సంక్షేమాన్ని, అభివృద్ధిని అందిస్తుందని వివరించారు.
దేశ సమైక్యత కోసం అపారమైన కృషిచేసి సంగటితం చెసి 565 సంస్థానాలను భారత్లో విలీనం చేసి అఖండ భారతదేశాన్ని నిర్మించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతీయుల గుండెలో పదిలంగా నిలిచిపోయారని తెలిపారు. ఆత్మ చేర్మెన్ వినోద్ పటేల్ , మున్సిపల్ వైస్ చేర్మెన్ దారం శంకర్ సెట్ కౌన్సిలర్లు బాణపురం రాజు, సుబూర్, వివేకానంద, మురళి .. సర్పంచ్ లు హన్మంత్.నర్సింగ్. హన్మoడ్లు.గోవిందా నాయక్.చందర్ నాయక్ .ముదిరాజ్ తాలూకా అధ్యక్షులు శంకర్. కిషన్ రాథోడ్ బేస్ జిల్లా నాయకులు రాజు. సంగప్ప. అంజిరెడ్డి.సాయిలు. శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.

