wanaparthi dist

మోడల్ స్కూల్‌లో విద్యార్థులకు ట్రంకు పెట్టెలు టవల్స్ అందజేత 

మోడల్ స్కూల్‌లో విద్యార్థులకు ట్రంకు పెట్టెలు టవల్స్ అందజేత 

By ·

Share this article
మోడల్ స్కూల్‌లో విద్యార్థులకు ట్రంకు పెట్టెలు టవల్స్ అందజేత 

మోడల్ స్కూల్‌లో విద్యార్థులకు ట్రంకు పెట్టెలు టవల్స్ అందజేత 


టీ మీడియా,అక్టోబర్ 31 పెబ్బేరు:
వనపర్తి జిల్లా పెబ్బేరు పట్టణ పరిధిలోని మోడల్ స్కూల్ (జూనియర్ కళాశాల)లో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం సమకూర్చిన ట్రంకు పెట్టెలు టవల్స్‌ను మున్సిపల్ చైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్ అందజేశారు ఈ సందర్భంగా శనివారం హాస్టల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ప్రభుత్వ పాఠశాలలు జూనియర్ కళాశాలల్లో చదువుతున్న పేద మధ్యతరగతి విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి వసతులు కల్పించడమే ధ్యేయంగా రాష్ట్ర సిఎం రేవంత్ రెడ్డి వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి  కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు విద్యార్థులు ఈ వసతులను సద్వినియోగం చేసుకొని బాగా చదువుకుని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు
కళాశాలలో వసతి గృహంలో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థులకు అవసరమైన సామగ్రిని అందించడం అభినందనీయమని ఉపాధ్యాయులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ సౌజన్య దిలీప్ రెడ్డి పాఠశాల ప్రిన్సిపాల్ నరేష్ కుమార్ నాయకులు రాములు యాదవ్ సురేందర్ గౌడ్ రణధీర్ రెడ్డి రామన్ గౌడ్ భాను ప్రకాష్ రెడ్డి వినోద్ భాను ప్రకాష్ సునీల్ రెడ్డి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ అక్కల జ్యోతి ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు