డెలివరీ ముసుగులో గంజాయి దందా..
ఇద్దరిని అరెస్టు
టీ మీడియా, అక్టోబర్ 24 , హైదరాబాద్ బ్యూరో : ఆహారాన్ని అందించే డెలివరీ బ్యాగుల్లో మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్న ముఠా గుట్టును మహేశ్వరం ఎస్వోటీ పోలీసులు రట్టు చేశారు. స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్స్ ముసు గులో దర్జాగా తిరుగుతూ… గంజాయి డోర్ డెలివరీ చేస్తున్న ఇద్దరు నిందితులను మహేశ్వరం ఎస్వోటీ పోలీ సులు శుక్రవారం ఇబ్రహీంపట్నంలో అదుపులోకి తీసుకున్నారు.
మహేశ్వరం ఎస్వీటీ పోలీసులు, మంచాల పోలీసుల కథనం ప్రకారం.. ఏపీలోని అరకు ప్రాంతానికి చెందిన ప్రధాన నిందితుడు ప్రదీప్ నుంచి రవి, సుకేశ్ బాబు అనే వ్యక్తులు విజయవాడ కేంద్రంగా గంజాయిని కొని అక్కడి నుంచి హైదరాబాద్ నగరానికి గుట్టుచప్పుడు కాకుండా తరలించారు. పోలీ సుల కండ్లు కప్పేం దుకు స్విగ్గీ, జొమాటో బ్యాగులను సాధనంగా ఎంచుకున్నారు. ఆహార పదార్థాల డెలివరీ సిబ్బందిలా పలు కాలనీల్లో తిరుగుతూ తమ నెట్వర్క్ లోని రెగ్యులర్ వినియోగదారులకు గంజాయిని డోర్ డెలివరీ చేస్తున్నారు. కాగా, శుక్రవారం మహేశ్వరం ఎస్వోటీ పోలీసులు సాగర్ రహదారిపై ఇబ్రహీంపట్నం, ఆగాపల్లి పరి సర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తుండగా డెలివరీ బ్యాగులతో గంజాయి సరఫరా చేస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
వారి నుంచి 1.1 కేజీల ఎండు గంజాయి, ఏపీ 29పీ 8911 నంబర్ల సిటీ 100 బైక్, గంజాయిని తూకం వేసే మిషన్, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని మంచాల పోలీసులకు అప్పగించగా.. వారు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల్లో ఇంజినీరింగ్ కళాశాలలు, ప్రైవేట్ హాస్టళ్లు విచ్చలవిడిగా పెరుగుతుండటంతో కొందరు గంజాయి విక్రయదారులు విద్యార్థులను గంజాయి మత్తులోకి దింపుతున్నారు. అలాగే, పరిసర ప్రాంతాల్లో పాన్ ప్లు, స్మోకింగ్ జోన్స్ తోపాటు చిన్నచిన్న షాపుల్లోనూ గంజాయిని విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.






