andrapredesh

రాప్తాడు బాలికపై దాడి కేసు..  -నిందితుడి కాలును పూర్తి తొలగింపు

రాప్తాడు బాలికపై దాడి కేసు..  -నిందితుడి కాలును పూర్తి తొలగింపు

By ·

Share this article
రాప్తాడు బాలికపై దాడి కేసు..  -నిందితుడి కాలును పూర్తి తొలగింపు

రాప్తాడు బాలికపై దాడి కేసులో బిగ్‌ అప్‌డేట్..
 -నిందితుడి కాలును పూర్తి తొలగింపు

 

టీ మీడియా, నవంబర్ 3,విజయనగరం:

రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన రాప్తాడు బాలికపై రంపంతో దాడి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న హేమంత్‌ కుడి కాలిని తొలగించారు వైద్యులు. పోలీసులు అతన్ని పట్టుకునేందుకు వెళ్లగా వారిపై కత్తితో దాడి చేసి పారిపోయే ప్రయత్నం చేసిన హేమంత్‌పై పోలీసులు కాల్పులు జరపగా.. అతని కుడికాలికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో అతన్ని హాస్పిటల్‌కు తరలించగా.. కుడి పూర్తిగా చిత్రమైపోయిందని.. ఆ కాలికి రక్త సరఫరా పూర్తి నిలిచిపోయిందని వైద్యులు తేల్చారు. దీంతో ఆపరేషన్ చేసి కాళు తొలగించినట్టు వైద్యులు తెలిపారు. మరో కాలికి కూడా తీవ్ర గాయాలు అయ్యాయని.. దానికి ఇంకా కొన్ని పరీక్షలు నిర్వహిస్తున్నట్టు వైద్యులు తెలిపారు.

కోలుకుంటున్న బాధిత బాలిక


ఇదిలా ఉండగా రాప్తాడు ఘటనలో తీవ్రంగా గాయపడిన విద్యార్ధిని క్రమంగా కోలుకుంటోంది. బెంగళూరులోని మణిపాల్‌ ఆసుపత్రిలో బాధితురాలికి మెరుగైన చికిత్సను అందిస్తున్నారు. వైద్యుల సూచనలను అర్ధం చేసుకుని బాధితురాలు స్పందిస్తున్నట్టుగా మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. గురువారం సాయంత్రం వరకు వెంటిలేటర్‌ సపోర్టు తొలగించే అవకాశం ఉందని వైద్యులు భావిస్తున్నట్టుగా ఎక్స్‌ వేదికగా మంత్రి లోకేశ్‌ వెల్లడించారు.


మాజీ సీఎం జగన్ పరామర్శ

మరోవైపు మణిపాల్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్దిని వైసీపీ అధినేత జగన్ పరామర్శించారు. ఆమెకు అందుతున్న వైద్యం గురించి డాక్టర్లను ఆరా తీశారు. మద్యం, గంజాయి విచ్చలవిడిగా దొరకడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. బాధితురాలి కుటుంబానికి రూ. 50 లక్షల పరిహారం ఇవ్వాలని వైఎస్‌ జగన్‌ డిమాండ్‌ చేశారు.