రేషన్ షాపులకు చేరని ప్రజాపంపిణీ బియ్యం
- అధికారులు తీరుతో కార్డుదారుల తిప్పలు
టీ మీడియా, నవంబర్ 3,ఖమ్మం బ్యూరో:
జిల్లా వ్యాప్తంగా ఉన్న పలు
రేషన్ షాపులకు ప్రజాపంపిణీ బియ్యం ఇంకా చేరలేదు.
ఎల్ నివో ప్రభావంతో నిరుపేదలు ఆకలి అవస్థలు పడుతున్నారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు కార్డుదారులకు మూడు నెలలా ప్రజాపంపిణీ బియ్యంను సరఫరా చేసిన విషయం విదితమే.ఈ క్రమంలో రేషన్ షాపుల డీలర్లు,బ్యాక్ లాగ్ లేకుండా జీరో చూపించిన షాపులకు ముందుగా రేషన్ బియ్యం పంపిణీ చేస్తూ...బ్యాక్ లాగ్ బియ్యం చూపించిన షాపులకు ఆలస్యంగా ప్రజాపంపిణీ బియ్యం దిగుమతి చేయాలని పౌరసరఫరా శాఖ అధికారులు తీరుతో,కార్డు దారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.సదరు డీలర్లు కూడా ఈ విధానంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు.
సివిల్ సప్లై అధికారుల వింత పోకడతో కార్డుదారుల రేషన్ షాపుల వద్దకు ప్రజాపంపిణీ బియ్యం కోసం వచ్చి వెనుతిరిగి వెళ్లిపోతున్నారు.రేషన్ షాపులకు ఈనెల 3వ తేదీ వచ్చిన ఇంకా పలు రేషన్ షాపులకు బియ్యం దిగుమతి కాలేదు.ఈనెల 15వ తేదీ చివరి గడవని పౌరసరఫరాల శాఖ జిల్లా అధికారి చెబుతున్నారు.
జీరో చూపించిన షాపులకు ముందుగా రేషన్ బియ్యం పంపిణీ అనే నిబంధనతో కార్డుదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.నిబంధనను సడలించి అన్ని రేషన్ షాపులకు ఓకే కాలంలో,ఒకేసారి ప్రజా పంపిణీ బియ్యం ను సరఫరా చేసి నిరుపేద కార్డుదారులకు సకాలంతో బియ్యం అందించాలని కార్డు దారులు,డీలర్లు సంబంధిత అధికారులను డిమాండ్ చేస్తున్నారు.





