ఢిల్లీ

Same Aadhaar number for two students Students facing difficulties

Same Aadhaar number for two students Students facing difficulties

By ·

Share this article
Same Aadhaar number for two students  Students facing difficulties

 

ఇద్దరు విద్యార్థులకు ఒకే ఆధార్ నంబర్                                                               

 ఇబ్బంది పడుతున్న స్టూడెంట్స్

 

టీ మీడియా,నవంబర్14, ఢిల్లీ బ్యూరో : భారత పౌరులకు ప్రత్యేక గుర్తింపునిచ్చేందుకు రూపొందించిన 'ఆధార్' వ్యవస్థలో అరుదైన ఘటన వెలుగులోకి వచ్చింది. వేర్వేరు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు విద్యార్థులకు ఒకే ఆధార్ నంబర్ కేటాయించబడటం గమనార్హం. ఈ సాంకేతిక తప్పిదం కారణంగా ఆ ఇద్దరు విద్యార్థులు గత కొన్ని సంవత్సరాలుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడం లేదు.

అసలు ఏం జరిగింది?
ఛత్తీస్‌గఢ్​లోని ఖైరాఘర్-ఛుయిఖదాన్-గండై జిల్లా పరిధిలోని టోలాగావ్ గ్రామానికి చెందిన ధనేశ్వర్ సాహూ కుమారుడు జతిన్ సాహూ ప్రస్తుతం 11వ తరగతి చదువుతున్నాడు. అయితే, ఇటీవల కాలంలో అతనికి అందాల్సిన ప్రభుత్వ స్కాలర్‌షిప్ నిలిచిపోవడంతో కుటుంబ సభ్యులు ఆరా తీశారు. హరియాణా అంబాలా ప్రాంతానికి చెందిన మరో జతిన్ అనే విద్యార్థికి, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన జతిన్‌కు కేటాయించిన ఆధార్ నంబర్ ఒకటే అని తేలింది. ఇద్దరి పేర్లు, పుట్టిన తేదీలు ఒకేలా ఉండటంతో పాటు, వారిద్దరికీ ఒకే నంబర్‌తో కూడిన డిజిటల్ గుర్తింపు కార్డు జారీ కావడంతో ఈ గందరగోళం తలెత్తినట్లు తేలింది.

నాలుగేళ్లుగా ఇబ్బందులు
ఛత్తీస్‌గఢ్‌కు చెందిన జతిన్ సాహూ కుటుంబం ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి గత నాలుగు సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం గత నాలుగేళ్లుగా ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థి తండ్రి ధనేశ్వర్ సాహూ కన్నీటి పర్యంతమయ్యారు.

తన కొడుకు జతిన్ బ్యాంక్ ఖాతాకు ఆధార్‌ను అనుసంధానించాలని చూస్తే బయోమెట్రిక్ తీసుకోవడం లేదని ధనేశ్వర్ సాహూ తెలిపారు. హర్యానాకు చెందిన మరో కుర్రాడు తన ఆధార్‌ను అప్‌డేట్ చేయించుకున్నందు వల్ల ఇక్కడ తన కొడుకు వేలిముద్రలు పనిచేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల పాఠశాల నుంచి రావాల్సిన విద్యార్థి స్కాలర్‌షిప్ పూర్తిగా నిలిచిపోయిందని చెప్పారు. కేవలం స్కాలర్‌షిప్ మాత్రమే కాకుండా, మా కుటుంబానికి రావాల్సిన రేషన్ సరుకులు పొందడంలోనూ, కొత్త సిమ్ కార్డులు తీసుకోవడంలోనూ తీవ్ర అడ్డంకులు ఎదురవుతున్నాయని వాపోయారు.

హరియాణా విద్యార్థిది కూడా అదే వ్యథ
ఛత్తీస్‌గఢ్ విద్యార్థి ఒక్కడే కాకుండా, హరియాణాలోని అంబాలాలో నివసిస్తున్న మరో జతిన్ కూడా సరిగ్గా ఇదే రకమైన సమస్యను ఎదుర్కొంటున్నాడు. రెండు వైపుల కుటుంబాలు ఫోన్లలో మాట్లాడుకుని తమ గోడును వెళ్లబోసుకున్నాయి. హరియాణాలోని విద్యార్థి తండ్రి కూడా ఈ సమస్యపై స్పందించారు. 'ఈ సమస్యను పరిష్కరించడానికి నేను కూడా నా వంతు ప్రయత్నం చేస్తాను, మీరూ సాయం చేయండి' అని కోరినట్లు ధనేశ్వర్ తెలిపారు. ఈ ఉదంతం స్థానిక మీడియా ద్వారా వెలుగులోకి రావడంతో ఖైరాఘర్ జిల్లా యంత్రాంగం స్పందించింది.

అదనపు కలెక్టర్ సురేంద్ర ఠాకూర్ ఈ ఘటనపై మాట్లాడుతూ, బాధితులు నేరుగా తమను సంప్రదించి రాతపూర్వక దరఖాస్తు అందజేస్తే, దానిని వెంటనే భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ప్రాంతీయ కార్యాలయానికి సిఫారసు చేస్తామని తెలిపారు. "ఆధార్ నమోదు లేదా అప్‌డేట్ చేసే సమయంలో ఏదైనా సాఫ్ట్‌వేర్ లేదా సాంకేతిక లోపం జరిగి ఉండవచ్చు. ఇలాంటి క్లిష్టమైన సమస్యల పరిష్కారం కేవలం యూఐడీఏఐ ప్రధాన కార్యాలయం స్థాయిలోనే సాధ్యమవుతుంది. బాధితులకు త్వరలోనే న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటాం" అని చెప్పారు.

Tags: