Telangana

'Indiramma' family life insurance for every household. Officials' disclosure

'Indiramma' family life insurance for every household. Officials' disclosure

By ·

Share this article
'Indiramma' family life insurance for every household.  Officials' disclosure

 

 

ఇంటింటికి   ఇందిరమ్మ కుటుంబ  జీవిత  బీమా.

అధికారుల  వెల్లడి

 


టీ మీడియా, నవంబర్ 14 ,కూసుమంచి : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం వర్తించనుంది. నవంబర్ 19వ తేదీన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమయ్యే ఈ పథకం ఇకనుంచి అమలు జరుగునుందని అధికారులు వెల్లడించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శనివారం కూసుమంచి మండలం ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో మండల ప్రత్యేక అధికారి తుంబూరి సునీల్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. కూసుమంచి మండల పరిషత్ అభివృద్ధి అధికారి తాటిపాముల జశ్వంత్ కుమార్, తాసిల్దార్ సైదయ్య, మండల పంచాయతీ అధికారి హనుమంతరావు పాల్గొన్న సమావేశంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం గురించి వివరించారు. ఈ సమావేశంలో మండల ప్రత్యేక అధికారి, ఎం పీ డీ వో మాట్లాడుతూ పథకం ప్రారంభం మొదలుకొని ప్రతి  గ్రామ పంచాయతీలలో అప్లికేషన్లు తీసుకుంటామన్నారు. ఒక్కొక్క కుటుంబం నుంచి ఒక్కరు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని మిగతా కుటుంబ సభ్యులు భార్య గాని, పిల్లలు గాని, నామినీగా ఉంటారని తెలుపుతూ ప్రమాదవశాత్తు దరఖాస్తుదారుడు చనిపోతే ఆ కుటుంబం రోడ్డున పడకుండా  కుటుంబానికి చేయూతగా 5 లక్షలు రూపాయలు భీమ అందించడం జరుగుతుందన్నారు. ఇట్టి  పథకానికి వయసు నిర్ధారణ ఆధార్ కార్డు ప్రకారం దరఖాస్తుదారుడికి 18 నుంచి 59 సంవత్సరాలు  ఉండాలని అలాగే నామినీకి  ఎలాంటి వయస్సు నిబంధన అవసరం లేదని, దరఖాస్తుదారులు తెలంగాణ రాష్ట్రంలో పుట్టిన వారు మాత్రమే అర్హులని, అన్ని గ్రామపంచాయతీలో గ్రామసభలు పెట్టి ప్రతి 50 ఇండ్లకు ఒక కౌంటర్ చొప్పున అవసరమైన కౌంటర్లు ఏర్పాటు చేసి అప్లికేషన్లు తీసుకోవడం జరుగుతుందని వారు చెప్పారు. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం గురించి గ్రామాలలో ప్రజలకు అవగాహన కల్పించినట్లు ప్రత్యేక అధికారి తుంబూరి సునీల్ రెడ్డి, ఎం పీ డీ వో తాటిపాముల జశ్వంత్ కుమార్ తెలిపారు. ఈ సమావేశంలో సర్పంచులు బానోతు నాగేశ్వరరావు, హలవత్తు వీరయ్య, కొండ కృష్ణవేణి మహిపాల్, మల్లెల స్వాతి ఉపేందర్, బాదావత్ నరేష్, దాట్ల సతీష్ ( సలీం ), పంచాయతీ కార్యదర్శులు రాజేష్, ఇందిరా, నీరజ, తదితరులు పాల్గొన్నారు.

 

 

 

 

Tags: