Telangana

Loan of Rs 40,000 taken via a loan app Constable dies by suicide, unable to bear the harassment

Loan of Rs 40,000 taken via a loan app Constable dies by suicide, unable to bear the harassment

By ·

Share this article
Loan of Rs 40,000 taken via a loan app  Constable dies by suicide, unable to bear the harassment

 

 

లోన్​ యాప్​లో రూ.40 వేల రుణం                                                                              

 వేధింపులు భరించలేక కానిస్టేబుల్ ఆత్మహత్య
 

 

టీమీడియా , నవంబర్10 , రంగారెడ్డి : ఆన్‌లైన్ లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు భరించలేక ఒక పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద ఘటన హైదరాబాద్‌ పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం వెలుగు చూసింది. లోన్ యాప్​లో తీసుకున్న రుణాన్ని వెంటనే తిరిగి చెల్లించకపోతే నగ్నంగా నిలబెడతామని యాప్ నిర్వాహకులు బెదిరించడంతో పోలీస్ కానిస్టేబుల్ బలవన్మరణానికి పాల్పడ్డాడు.

అప్పు కట్టాలని యాప్​ నిర్వాహకుల వేధింపులు
ఇన్‌స్పెక్టర్ లక్ష్మీ నారాయణ రెడ్డి తెలిపిన కథనం ప్రకారం, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం హర్షగూడకు చెందిన ముడవత్ శ్రీను (31), కొండాపూర్ బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. అతనికి ఏడాది క్రితం వివాహం జరిగింది. అయితే 4 నెలల క్రితం అతను తన యాప్ నుంచి రూ.40,000 అప్పు తీసుకున్నాడు. దానిని తిరిగి చెల్లించకపోవడంతో యాప్ నిర్వాహకులు అతడిని వేధించడం ప్రారంభించారు.

మనస్తాపానికి గురై ఆత్మహత్య
దీపావళి వేళ డ్యూటీకి సెలవులు పెట్టి ఆదివారం రోజు అతను ఇంట్లోనే ఉండగా, లోన్​ యాప్​ నిర్వాహకులు ప్రతి గంటకు ఫోన్ చేసి వేధించారు. తీసుకున్న రుణాన్ని వెంటనే తిరిగి చెల్లించకపోతే శ్రీను, అతడి భార్య నగ్న చిత్రాలను వారి కుటుంబ సభ్యులతో పాటు హర్షగూడ గ్రామస్థులకు పంపుతామని బెదిరించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన శ్రీను, సోమవారం ఉదయం తన ఇంట్లో చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, దర్యాప్తు జరుగుతోందని తెలిపారు.

ఆత్మహత్య పరిష్కారం కాదు
జీవితమన్నాక ఏదో ఒక సందర్భంలో సమస్యలు ఎదురవడం సాధారణమని, వాటికి తగిన విధంగా ఆలోచిస్తే పరిష్కార మార్గాలు దొరుకుతాయని నిపుణులు చెబుతున్నారు. మీకు ఆత్మహత్యకు సంబంధించిన ఆలోచనలు వచ్చినా, తీవ్ర ఒత్తిడికి గురవుతున్నా, మీ సమస్యను ఇతరులతో పంచుకోవాలని భావిస్తున్నా, మీకు సహకరించేందుకు హెల్ప్​లైన్ సెంటర్లు సిద్ధంగా ఉన్నాయి. అందుకోసం స్నేహ ఫౌండేషన్ - 04424640050 24x7 అందుబాటులో ఉంటుంది లేదా టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ హెల్ప్‌లైన్ - 9152987821కి సంప్రదించవచ్చు. వీరు ఆదివారం మినహాయించి సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 8 నుంచి రాత్రి 10 గంటల వరకు అందుబాటులో ఉంటారు. వారిని సంప్రదించి మీ సమస్యలను వివరించవచ్చు. తద్వారా తగిన పరిష్కార మార్గాలను పొందవచ్చు.

Tags: