Telangana

A dispute over one and a half acres of land... Brutally [attacked/harmed] his younger brother's wife...

A dispute over one and a half acres of land... Brutally [attacked/harmed] his younger brother's wife...

By ·

Share this article
A dispute over one and a half acres of land...  Brutally [attacked/harmed] his younger brother's wife...

 

 

ఎకరంన్నర భూమి విషయంలో గొడవ..                                                

తమ్ముడి భార్యను దారుణంగా..

 
టీ మీడియా, నవంబరు 4, మహబూబ్‌నగర్  : ఆస్తి విషయంలో తలెత్తిన వివాధం కారనంగా అన్నలు తమ్ముడి భార్యను అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. కోయిలకొండ మండలం చింతల్‌తండాకు చెందిన బలరాంతో మహబూబ్‌నగర్ మండలం ఓబులాయపల్లికి చెందిన సునీతకు 12 ఏళ్ల క్రితం వివాహమైంది. అయితే బలరాంకు మతిస్థిమితం సరిగ్గా లేకపోవడంతో కుటుంబ బాధ్యతలన్నీ భార్య సునీతే చూసుకునేది. ఈ క్రమంలో భర్తకు వారసత్వంగా రావాల్సిన ఎకరంన్నర భూమి విషయంలో కుటుంబంలో వివాదం మొదలైంది.

ఏడాది క్రితం గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించి ఆ భూమిని సునీత పేరు మీద పట్టా చేయించారు. అయితే భూమి సునీత పేరు మీద పట్టా కావడం బలరాం అన్నలు పాండునాయక్, మన్యానాయక్‌లకు నచ్చలేదని తెలుస్తోంది. ఎలాగైనా ఆ భూమిని తమ ఆధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నించారు. ఈ క్రమంలో మతిస్థిమితం సరిగ్గా లేని బలరాంను తరచూ తమ వెంట హైదరాబాద్‌కు తీసుకెళ్తూ సునీతపై ఒత్తిడి పెంచినట్లు సమాచారం. భూమిని తమకు ఇవ్వాలని, ఇంటిని ఖాళీ చేసి వెళ్లిపోవాలని హెచ్చరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. లేదంటే చంపేస్తామంటూ బెదిరించినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో నవంబర్ 2న మధ్యాహ్నం భర్త బలరాం ఇంట్లో లేని సమయాన్ని నిందితులు అదునుగా తీసుకున్నారు. మామ మాణిక్యనాయక్, బావలు పాండునాయక్, మన్యానాయక్, పాండు భార్య పార్వతి సునీత ఇంటికి వెళ్లారు. భూమి విషయంలో ఆమెతో గొడవపడి, మెడకు పంచె కట్టి తమ ఇంటికి లాక్కెళ్లారు. అనంతరం కత్తులతో గొంతు కోసి హత్య చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అంతటితో ఆగకుండా తల, మొండెం వేరు చేసి అత్యంత దారుణానికి పాల్పడ్డారు.

ఎకరంన్నర భూమి కోసం సొంత కుటుంబంలోనే ఇంతటి దారుణం జరగడం చింతల్‌తండాలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆస్తి వివాదమే హత్యకు ప్రధాన కారణమా? ఇందులో మరెవరైనా పాత్ర ఉందా? అనే కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Tags: