hyderabad

Social Media Stirring Up Discord - Factions within apartments and gated communities

Social Media Stirring Up Discord - Factions within apartments and gated communities

By ·

Share this article
Social Media Stirring Up Discord  - Factions within apartments and gated communities

 

చిచ్చుపెడుతున్న సోషల్ ​మీడియా                                                              

  అపార్ట్​మెంట్లు​, గేటెడ్ కమ్యూనిటీల్లో గ్రూపుల రచ్చ

 

టీ మీడియా, నవంబరు 4, హైదరాబాద్ బ్యూరో ;  ఉపాధి, ఉద్యోగావకాశాల పేరిట దేశం నలువైపుల నుంచి ఎంతో మంది హైదరాబాద్​కు వస్తుంటారు. వీరంతా కాలనీలు, గేటెడ్​ కమ్యూనిటీలు, అపార్ట్​మెంట్లలో నివసిస్తుంటారు. అయితే వీళ్ల మధ్య సామాజిక మాధ్యమాలు చిచ్చుపెడుతున్నాయి. వాటి వల్ల ఒకరితో ఒకరు పోట్లాడుకునే స్థాయి వరకు వెళ్తున్నారు. నగరంలో ఇలాంటివి ప్రతి నెలా 20 నుంచి 30కి పైగా ఫిర్యాదులు అందుతున్నట్టు పోలీసులు చెబుతున్నారు.

గొడవకు కారణం ఇదే!
అపార్ట్​మెంట్లలో కుటుంబాలన్నీ ఒకేచోట నివసిస్తాయి. దీంతో వారంతా వాట్సప్​ గ్రూప్​లను ఏర్పాటు చేసుకుంటున్నారు. దీని ద్వారా సమాచార మార్పిడి సులభంగా జరుగుతుంది. సంక్షేమ సంఘ ప్రతినిధులు సమయం కలిసొస్తుందనే ఉద్దేశంతో పలు వివరాలను ఈ గ్రూపుల్లో పోస్ట్​ చేస్తుంటారు. కారు పార్కింగ్​, విద్యుత్తు, పారిశుద్ధ్యం, వాచ్​మెన్​, తాగు నీరు వంటి అంశాలను గ్రూప్స్​లలో పెడుతుంటారు.

అయితే కొంతమంది నెలవారీ నిర్వహణ ఖర్చులు సక్రమంగా చెల్లించరు. అలాంటి వారికి సేవలను నిలిపేయాలంటూ పలువురు అంటుంటారు. దానికి మిగిలిన సభ్యులు కూడా స్పందిస్తుంటారు. ఇక అలాంటి సమయంలోనే గొడవ మొదలవుతుంద. ఈ మేరకు నగరానికి చెందిన ఇన్​స్పెక్టర్​ తెలిపారు.

ఉదాహరణలు ఇవే!
యూసుఫ్​గూడలో ఓ అపార్ట్​మెంట్​ ఉంది. దాంట్లో మొత్తం 12 కుటుంబాలు నివసిస్తున్నాయి. వీరంతా వాట్సప్​ గ్రూప్​ ద్వారా అనేక విషయాలను చర్చించుకుంటారు. ఈ క్రమంలో నీటి బిల్లులు సరిగ్గా కట్టనందున తాగునీటి సరఫరా ఆగిపోయింది. దీనిపై ఒక సభ్యుడు పోస్ట్​ చేయగా, ఇద్దరు వ్యక్తులు స్పందించారు. అది కాస్త గొడవకు దారితీసింది. చివరకు పోలీస్​స్టేషన్​ వరకు వెళ్లింది. అంతకు ముందు మిత్రులుగా ఉండే ఆ 4 కుటుంబాల మధ్య ఇప్పుడు దూరం పెరిగింది.
లంగర్​హౌస్​ పరిధిలోని ఓ అపార్ట్​మెంట్​లో పదేళ్లుగా 10 కుటుంబాలు నివసిస్తున్నాయి. అక్కడి గృహిణులు కిట్టీ పార్టీ కోసం ఓ ఫేస్​బుక్​ గ్రూప్​ను క్రియేట్​ చేసుకున్నారు. దాంట్లో ఉన్న ఫొటోలకు కొందరు లైక్​లు కొట్టారు. అది మిగతా వాళ్లకు నచ్చక మాట్లాడటం మానేశారు. పండుగలు, పుట్టిన రోజు వేడుకల్లో సరదాగా ఉండే వారి ఇళ్లలో అప్పటి నుంచి కలహాలు మొదలయ్యాయి. వారంతా శత్రువులుగా మారిపోయారంటూ కాలనీ సంక్షేమ సంఘ అధ్యక్షుడు పేర్కొన్నారు.
జూబ్లీహిల్స్​లో ఒక కాలనీకి చెందిన మహిళలు వాట్సప్​, ఇన్​స్టాలో గ్రూపులు ఏర్పాటు చేసుకున్నారు. ఈ గ్రూప్​లో ఉన్న ఓ గృహిణి తన కుమార్తెకు ప్రముఖ ఐటీ కంపెనీలో ఉద్యోగం వచ్చిందని గ్రూప్​లో పోస్ట్​ పెట్టింది. దీంతో ఓ ఉద్యోగిని తల్లిదండ్రులు క్రమశిక్షణతో ఉంటే పిల్లలు మంచి స్థాయికి వెళ్తారంటూ కామెంట్​ పెట్టింది. అలా కామెంట్​ చేయటం ఆ గ్రూపు సభ్యుల్లో ఒకరికి నచ్చకపోవటంతో ప్రతికూలంగా స్పందించింది. అలా పరస్పరం ఒకరినొకరు స్పందించుకున్నారు. దీనివల్ల ప్రతి పండుగ వేర్వేరుగా నిర్వహించుకుంటున్నారు.
బంధాల మధ్య పెరుగుతున్న దూరం

అప్పటివరకు ఆప్యాయంగా కలిసి ఉండేవారు, సోషల్​ మీడియా వల్ల బద్ధ శత్రువులుగా మారిపోతున్నారు. చాలా వరకు కుల, మత వ్యక్తిగత విషయాలను షేర్​ చేసినప్పుడు అధిక శాతం గొడవలు అవుతున్నాయని పోలీసుల దర్యాప్తులో తేలింది. రాజీ కుదిర్చేందుకు ప్రయత్నించినా కేసు నమోదుకే కొంత మంది మొగ్గు చూపుతున్నారని, పరిధి దాటి ప్రవర్తిస్తే పెట్టీ కేసులు నమోదు చేస్తున్నామని అధికారి పేర్కొన్నారు.

Tags: