Telangana

Retirement Felicitation Program for Headmaster Nagur K.

Retirement Felicitation Program for Headmaster Nagur K.

By ·

Share this article
Retirement Felicitation Program for Headmaster Nagur K.

 

 

నాగూర్ కె ప్రధానోపాధ్యాయులు పదవీ విరమణ అభినందన కార్యక్రమం

 

టీ మీడియా, అక్టోబర్ 31 ,నారాయణఖేడ్ :కంగ్టి మండల పరిధిలోని నాగూర్ కె. ప్రాథమిక పాఠశాల ఎల్ ఎఫ్ ఎల్  ప్రధానోపాధ్యాయులు అజ్జే రవీందర్ – మల్లేశ్వరి దంపతుల పదవీ విరమణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా రవీందర్ రావు సార్  ఉపాధ్యాయ వృత్తిలో అందించిన విశిష్ట సేవలను, విద్యార్థుల అభ్యున్నతికి మరియు విద్యారంగ అభివృద్ధికి వారు చేసిన కృషిని గుర్తుచేసుకుంటూ వారి సేవలను కొనియాడడం జరిగింది. అంకితభావంతో, బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి ఉపాధ్యాయ వృత్తికే వన్నె తెచ్చిన వారి సేవలు ఎప్పటికీ గుర్తుండి పోతాయని పలువురు వక్తలు తమ ప్రసంగాల్లో పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో నాగలిగిద్ద మండల విద్యాధికారి మన్మధ కిషోర్, నాగలిగిద్ద కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు సిద్ధారెడ్డి , పీఆర్టీయు టీఎస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు పాండురంగారెడ్డి, నాగలిగిద్ద మండల అధ్యక్షులు శేరికార్ రమేష్ , మండల అసోసియేట్ అధ్యక్షులు విజేందర్ రెడ్డి , పెద్ద గోపులారం ప్రధానోపాధ్యాయులు భాస్కర్, గంగాపూర్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరెడ్డి , విట్టల్ రెడ్డి తదితర ఉపాధ్యాయులు, ప్రముఖులు పాల్గొని పదవీ విరమణ పొందుతున్న వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. పదవీ విరమణ అనేది ఉద్యోగ జీవితానికి ముగింపు మాత్రమే.. జీవిత ప్రయాణంలో ఒక నూతన అధ్యాయానికి ఆరంభం.
విరమణ అనంతరం వారి జీవితాలు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, ప్రశాంతతతో నిండాలని, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయడము జరిగింది .

Tags: