పేదల పెన్నిధి ఇందిరాగాంధీ
టీ మీడియా ,అక్టోబర్ 31 ,కూసుమంచి :యావత్తు బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం నిరంతరం కృషిచేసిన భారతరత్న, ఉక్కు మహిళ, భారత దేశ మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరా గాంధీ ప్రజల గుండెల్లో పేదల పెన్నిధిగా నిలిచారని రాష్ట్ర రెవిన్యూ గృహ నిర్మాణం సమాచారం పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం ఇన్చార్జి భీమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కూసుమంచి మండలం కాంగ్రెస్ అధ్యక్షులు బజ్జూరు వెంకటరెడ్డి పేర్కొన్నారు. కూసుమంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం ఇందిరా గాంధీ వర్ధంతి నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. బ్యాంకుల జాతీయకరణ, భూ సంస్కరణల చట్టం, తదితర ఉద్యోగ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో చిరస్మరణీయురాలుగా నిలిచారని, ఇందిరా గాంధీ సేవలను కొనియాడుతూ శ్రీనివాసరెడ్డి, వెంకటరెడ్డి స్మరించారు.
ఈ కార్యక్రమంలో కూసుమంచి గ్రామ సర్పంచ్ కొండా కృష్ణవేణి మహిపాల్, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ హఫీజుద్దీన్, మాజీ ఎంపీటీసీ సభ్యులు మా దాసు ఉపేందర్ రావు, కాంగ్రెస్ నాయకులు భారీ వీరభద్రం, చాట్ల పరశురాం, అంజయ్య, కొండా మహిపాల్, బెల్లంకొండ వెంకటేశ్వర్లు, గుండా విజయ్ పాల్ రెడ్డి, బెల్లంకొండ కిరణ్, భారీ సురేష్, గుండా భూపాల్ రెడ్డి, చంద్రయ్య, పలువురు సర్పంచులు, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.






