Telangana

Felicitation of V.V.S.A. Prasad, Chief Executive of the Heavy Water Board

Felicitation of V.V.S.A. Prasad, Chief Executive of the Heavy Water Board

By ·

Share this article
Felicitation of V.V.S.A. Prasad, Chief Executive of the Heavy Water Board

 

 

హెవీ వాటర్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ వి.వి.ఎస్.ఏ. ప్రసాద్‌ కు సన్మానం

 

టీ మీడియా, అక్టోబర్ 30,అశ్వాపురం: అశ్వాపురం గౌతమి నగర్‌కు విచ్చేసిన హెవీ వాటర్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్  వి.వి.ఎస్.ఏ. ప్రసాద్ ని అశ్వాపురం గ్రామపంచాయతీ సర్పంచ్ బానోత్ సదర్ లాల్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో  సన్మానించారు.

ఈ సందర్భంగా ప్రసాద్ యొక్క ఉద్యోగ ప్రస్థానాన్ని గుర్తుచేసుకుంటూ సర్పంచ్ పలు విషయాలను పంచుకున్నారు. 1989లో మణుగూరు లోని హెవీ వాటర్ ప్లాంట్‌లో కెమికల్ ఇంజనీర్‌గా ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన, తన ప్రతిభ, అనుభవం, అంకితభావంతో అంచెలంచెలుగా ఎదిగి డిప్యూటీ జనరల్ మేనేజర్ స్థాయికి చేరుకున్నారు. అనంతరం కోటా హెవీ వాటర్ ప్లాంట్‌కు బదిలీపై వెళ్లి జనరల్ మేనేజర్‌గా బాధ్యతలు నిర్వహించారు. తదుపరి ముంబైలోని హెవీ వాటర్ బోర్డులో అసోసియేట్ డైరెక్టర్‌గా సేవలందించి, ప్రస్తుతం హెవీ వాటర్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా ఉన్నత బాధ్యతలు చేపట్టడం అశ్వాపురం ప్రాంతానికి గర్వకారణమని సర్పంచ్ పేర్కొన్నారు.

గతంలో ఇద్దరూ కలిసి పనిచేసిన రోజుల నుంచి తమ మధ్య మంచి స్నేహపూర్వక సంబంధం ఉందని, ఈ సందర్భంగా ఆనాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆత్మీయంగా మాట్లాడుకున్నారు.

ఈ సందర్భంగా సర్పంచ్ బానోత్ సదర్ లాల్ మాట్లాడుతూ, శాస్త్ర సాంకేతిక రంగంలోనూ, అణుశక్తి రంగంలోనూ దేశ అభివృద్ధికి మరింత విశేష సేవలందిస్తూ, హెవీ వాటర్ బోర్డు ద్వారా నూతన ఉత్పత్తులు, పరిశోధనలు, విజయాలు సాధించి మన భారతదేశానికి మరింత మంచి పేరు ప్రతిష్ఠలు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

అశ్వాపురంలో తన ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించి దేశస్థాయిలో అత్యున్నత బాధ్యతలు చేపట్టడం స్థానిక ప్రజలకు ఎంతో గర్వకారణమని ఈ సందర్భంగా సర్పంచ్ సంతోషం వ్యక్తం చేశారు.

Tags: