ఎల్‌నినోపై అవగాహన గ్రామసభలో పాల్గొన్న జిల్లా కలెక్టర్!!
నీటి సంరక్షణ, చిరుధాన్యాల సాగుపై ప్రజలకు అవగాహన
టి మీడియా ,అక్టోబర్ 29 , ఖమ్మం రూరల్ : ఖమ్మం రూరల్ మండలంలోని చింతపల్లి గ్రామపంచాయతీలో నిర్వహించిన ఎల్‌నినో అవగాహన గ్రామసభలో జిల్లా కలెక్టర్ పాల్గొని ప్రజలతో మాట్లాడారు ఈ సందర్భంగా నీటి సంరక్షణ ఆవశ్యకత, నీటిని పొదుపుగా వినియోగించుకోవాల్సిన విధానాలు, చిరుధాన్యాల పంటల సాగు ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించారు
వాతావరణ మార్పుల నేపథ్యంలో నీటి వనరులను కాపాడుకోవడం, వర్షపు నీటిని ఒడిసిపట్టడం, భూగర్భ జలాల పెంపునకు తగిన చర్యలు తీసుకోవడం ఎంతో ముఖ్యమని వివరించారు. అలాగే తక్కువ నీటితో సాగు చేయగల చిరుధాన్యాల పంటలను ప్రోత్సహించడం ద్వారా రైతులు వ్యవసాయంలో స్థిరమైన దిగుబడులు సాధించేందుకు అవకాశం ఉంటుందని తెలియజేశారు
గ్రామస్థులు ఎదుర్కొంటున్న నీటి సమస్యలు, వ్యవసాయానికి సంబంధించిన అంశాలపై జిల్లా కలెక్టర్ ప్రజలతో చర్చించి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.
గ్రామస్థులు నీటి సంరక్షణ చర్యల్లో భాగస్వాములు కావాలని, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు, మండల స్థాయి అధికారులు, గ్రామపంచాయతీ ప్రతినిధులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.






