Telangana

Birthday celebrations for Minister Ponguleti. Donate blood and become a life-saver.

Birthday celebrations for Minister Ponguleti. Donate blood and become a life-saver.

By ·

Share this article
Birthday celebrations for Minister Ponguleti.  Donate blood and become a life-saver.

 

 

 మంత్రి పొంగులేటి జన్మదిన  వేడుకలు.

రక్తదానం చేసి ప్రాణదాతలుగా  నిలవండి

 

టీ మీడియా ,అక్టోబర్ 28, కూసుమంచి : రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు బుధవారం కూసుమంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో   నిర్వహించారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా కాంగ్రెస్   నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. కూసుమంచి మండలం కాంగ్రెస్   అధ్యక్షులు బజ్జూరి వెంకటరెడ్డి తో కలిసి,  క్యాంపు కార్యాలయ ఇన్చార్జి భీమిరెడ్డి శ్రీనివాసరెడ్డి మంత్రి జన్మదిన కేక్ ను కట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కరధ్వనాలు చేస్తూ, కేరింతలు కొడుతూ జై పొంగులేటి,..., పొంగులేటి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ... పెద్ద పెట్టును నినాదాలు చేశారు. ఒకరికొకరు కేక్, స్వీట్స్ తినిపించుకొని, ఆనందోత్సవంతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలో పాల్గొన్నారు 
రక్తదాన శిబిరం:_ 
 రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదినం సందర్భంగా కూసుమంచి క్యాంపు కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించారు.
 తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు ఉపయోగపడే రక్తాన్ని పలువురు స్వచ్ఛందంగా పాల్గొని, రక్తదానం చేసి మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. ఆపదలో ఉన్నవారికి రక్తాన్ని దానంగా ఇస్తే, ప్రాణాలను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుందని, అందుకు ప్రతి ఒక్కరూ రక్తాన్ని దానంగా ఇచ్చి ప్రాణదాతలుగా నిలవాలని ఈ సందర్భంగా క్యాంపు కార్యాలయం ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి, కూసుమంచి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెంకటరెడ్డి పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కూసుమంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జి భీమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కూసుమంచి మండల కాంగ్రెస్  అధ్యక్షుడు బజ్జూరి వెంకట్ రెడ్డి, నేలకొండపల్లి మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ కొండపర్తి సురేష్,  డీసీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మహ్మద్ హఫీజుద్దీన్, మాజీ ఎంపీపీ బానోత్ శ్రీనునాయక్, మాజీ ఎంపీటీసీ మాదాసు ఉపేందర్, నాయకులు  బొల్లంపల్లి సుధాకర్ రెడ్డి, భారీ వీరభద్రం, కంచర్ల జీవన్ రెడ్డి, చాట్ల పరుశురాం, అజ్మీర హీరామాన్ తండ గ్రామ కాంగ్రెస్   అధ్యక్షులు అజ్మీర జాను నాయక్, నాయకులు అజ్మీర్ నరసింహారావు, సర్పంచులు హలవత్ వీరయ్య, బానోతు నాగేశ్వరరావు, జర్పుల శ్రీను, నాయకులు ఎడవెల్లి పుల్లారెడ్డి, బత్తుల ఉప్పయ్య, చంద్రయ్య, శ్రీధర్, మహిళా నాయకురాలు వసంత, రమాదేవి, సుధారాణి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

Tags: