Telangana

'Praja Vani' (Public Voice) in Kusumanchi falls flat Lack of public response Empty chairs on display

'Praja Vani' (Public Voice) in Kusumanchi falls flat Lack of public response Empty chairs on display

By ·

Share this article
'Praja Vani' (Public Voice) in Kusumanchi falls flat  Lack of public response  Empty chairs on display

 

 

కూసుమంచి ప్రజావాణి  వెల వెల

ప్రజాస్పందన  కరవు

ఖాళీ కుర్చీలు దర్శనం

 


టీ మీడియా ,అక్టోబర్ 26 ,కూసుమంచి : సోమవారం జరిగిన ప్రజావాణి వెలవెల పోయింది. ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. సమస్యల పరిష్కారం కోసం ప్రజా స్పందన కరవైంది. ఇదంతా కూసుమంచి మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరములో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమ సంగతులు. సమావేశం సుమారు ఉదయం 10 :30 గంటలకు ప్రారంభం అయ్యి, మధ్యాహ్నం  1:00 గంటల వరకు జరిగింది. సమావేశ సమయమంతా అధికారులు నిరీక్షణ చేశారు. సమావేశంలో 2 బాధితులు మాత్రమే భూ సమస్యకి సంబంధించి దరఖాస్తులు తహసిల్దార్ సైదులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారి తాటిపాముల జశ్వంత్ కుమార్ కి  అందజేశారు. ప్రజావాణి సమావేశంలో ఇద్దరు, ముగ్గురు మాత్రమే మండల స్థాయి ప్రథమ శ్రేణి అధికారులు  ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొనగా, మిగతా వారంతా సంబంధిత ప్రభుత్వ శాఖల బాధ్యులు. ప్రజావాణి సమావేశంలో మొత్తం 29 ప్రభుత్వ శాఖల వారు పాల్గొనాల్సి ఉండగా, 19 శాఖల వారు మాత్రమే హాజరైనారు.  మిగతా 10 శాఖల బాధ్యులు ఖమ్మంలో జరుగుతున్న ఎల్ నినో సమావేశముకు వెళ్లినట్లు చెబుతున్నారు. ఇదిలా ఉండగా ప్రతి సోమవారం ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రజలకు అంతగా తెలియదని అనుకుంటున్నారు. అయితే ప్రజావాణి సమావేశం విషయం అన్ని గ్రామసభల్లో ప్రజలకు తెలియపరచాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ, ఎంపీడీవో కార్యాలయ సూపరింటెండెంట్ ఉదయ శ్రీ, రెవిన్యూ శాఖ వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు

Tags: