Telangana

Irregularities under the guise of savings groups Rs. 40 crore returned out of fear of getting caught

By ·

Share this article
Irregularities under the guise of savings groups  Rs. 40 crore returned out of fear of getting caught

 

పొదుపు సంఘాల మాటున అక్రమాలు                                                                                                             

దొరికిపోతామనే భయంతో రూ. 40 కోట్లు వెనక్కి
 
 

టీ మీడియా,అక్టోబర్ 23 , హైదరాబాద్ బ్యూరో : పట్టణ ప్రాంతాల్లో పేదరికాన్ని నిర్మూలించేందుకు అమలు చేస్తున్న మిషన్​ ఫర్​ ఎలిమినేషన్​ ఆఫ్​ పావర్టీ ఇన్​ మున్సిపల్​ ఏరియాస్​ (మెప్మా)లో అవినీతి విపరీతంగా పెరిగిపోతోంది. ఈ విషయమై ఫిర్యాదులు అందిన తర్వాత జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులు జరిపిన విచారణలో ఆందోళనకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తమదాకా వస్తే దొరికిపోతామనే భయంతో రాష్ట్రవ్యాప్తంగా అప్రమత్తమైన అవినీతి సిబ్బంది ఏకంగా రూ.40 కోట్లను బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం గమనార్హం. దీంతో రుణాల మంజూరు ప్రక్రియను పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు అధికారులు కసరత్తులు చేస్తున్నారు.

చేతివాటం ప్రదర్శిస్తున్న సిబ్బంది
పట్టణ ప్రాంతాల్లోని పేద మహిళలు సంఘాలుగా ఏర్పడి దరఖాస్తు చేసుకుంటే బ్యాంకులు వారికి రుణాలు అందిస్తాయి. వారు వాటిలో చిన్న వ్యాపారాలు చేసుకుని ఉపాధి అవకాశాలు పొందవచ్చు. ఈ రుణాల మంజూరు ప్రక్రియలో కమ్యూనిటీ ఆర్గనైజర్లు (సీవోలు) కీలక పాత్ర పోషిస్తారు. ఈ సంఘాల సూక్ష్మ రుణ ప్రణాళిక (మైక్రో క్రెడిట్​ ప్లాన్​)లను రూపొందించడంలో, వాటిని అధికారులకు సమర్పించడంలో, వారి ఆమోదం పొందిన తర్వాత బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించడంలో వీరు కీలక పాత్ర పోషిస్తారు. ఈ అవకాశాన్ని ఆసరాగా చేసుకుని కొందరు సీవోలు చేతివాటం ప్రదర్శిస్తున్నారు.

పని చేయని వాటికీ రుణాలు
తమకు వాటా ఇస్తామని చెప్పే సంఘాలకు మాత్రమే రుణాలు ఇప్పిస్తున్నారు. అసలు పని చేయని వాటికి కూడా రుణాలు మంజూరు చేయిస్తున్నారు. కొంతమంది సీవోలు పొదుపు సొసైటీలకు రుణాలు మంజూరు చేయిస్తున్నారు. అయితే వాటి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడం లేదు. ఫలితంగా దీనికి సంబంధించిన రుణాల గురించి అధికారులకు తెలియడం లేదు. ఈ సొమ్మను నిబంధనలకు విరుద్ధంగా వినియోగించుకోవాలన్నదే వీరి ఉద్దేశం.

నకిలీ పత్రాలతో రుణాలు
ఇంకోవైపు కొందరు సీవోలు మూసివేసిన, ఉనికిలో లేని సంఘాలకు నకిలీ పత్రాలతో రుణాలు ఇప్పించారు. ఉదాహరణకు సరూర్‌నగర్ సర్కిల్‌లో 2,241 సంఘాలు ఉండగా, వాటిలో 1,897 ఉనికిలో ఉన్నాయి. 310 సంఘాలు పని చేయడం లేదు. 34 డిఫాల్ట్ జాబితాలో ఉన్నాయి. ఎల్​బీనగర్ పరిధిలో 1,953 సంఘాలకు 1,783 క్రియాశీలకంగా ఉండగ 118 పని చేయడం లేదు, 52 డిఫాల్ట్ అయ్యాయి. హయత్‌నగర్ సర్కిల్​ పరిధిలోని 1,904 సంఘాలలో 1,395 క్రియాశీలంగా ఉన్నాయి, 469 పనిచేయడం లేదు, 40 డిఫాల్ట్ అయ్యాయి.

రాష్ట్రవ్యాప్త విచారణకు ఆదేశం
వాస్తవానికి పనిచేయని, డిఫాల్ట్ అయిన సంఘాలకు రుణాలు ఇవ్వకూడదు. అయితే అధికారులు అప్రమత్తమై అలాంటి సంఘాలకు రుణాల మంజూరుపై రాష్ట్రవ్యాప్త విచారణకు ఆదేశించగా వందలాది పొదుపు సంఘాల నుంచి రూ. 40 కోట్లు బ్యాంకుల్లో తిరిగి జమ అయినట్లు తెలుస్తోంది. చాలా మంది సీవోలు ఒకే సర్కిల్‌లో చాలా కాలంగా పనిచేస్తుండటంతో అక్కడి సంఘాల వారు, బ్యాంకుల సిబ్బందితో పరిచయాలు పెంచుకున్నారు. ఈ పెరిగిన పరిచయాలే అవకతవకలకు దారితీస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. దీంతో సంఘాల ఏర్పాటు, రుణాలకు అర్హత కలిగిన వాటిని గుర్తించడం, రుణాలను మంజూరు చేసే ప్రక్రియలో మరింత పారదర్శకతను పెంచే చర్యలపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు.

వెలుగులోకి విస్తుపోయే నిజాలు
అవకతవకల ఆరోపణలు వెలుగులోకి వచ్చిన తర్వాత అధికారులు జీహెచ్‌ఎంసీలోని కొన్ని సర్కిళ్లలో విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. వారి విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. సరూర్‌నగర్ సర్కిల్‌లోని సీఓ 28 సంఘాలకు రూ. 2,37,63,000, ఎల్​బీనగర్ సర్కిల్‌లోని మరో సీఓ 17 సంఘాలకు రూ. 1,45,27,000, హయత్‌నగర్ సర్కిల్‌లోని సీఓ మూడు సంఘాలకు రూ. 26 లక్షలు మంజూరు చేశారు. ఈ వివరాలేవీ ఆన్‌లైన్‌లో నమోదు కాలేదని విచారణలో వెల్లడైంది. దీంతో మొత్తం 48 సంఘాలకు మంజూరైన రుణాలను దేనికి ఉపయోగించారనే విషయంపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు.

Tags: