Telangana

Installation of the idol of Sri Kanaka Durgamma in Markodu with devotion and reverence Grand performance of Kumkuma Puja

Installation of the idol of Sri Kanaka Durgamma in Markodu with devotion and reverence Grand performance of Kumkuma Puja

By ·

Share this article
Installation of the idol of Sri Kanaka Durgamma in Markodu with devotion and reverence  Grand performance of Kumkuma Puja

 

​

మర్కోడులో భక్తిశ్రద్ధలతో శ్రీ కనకదుర్గమ్మ విగ్రహ ప్రతిష్ట 

 వైభవంగా కుంకుమ పూజల నిర్వహణ

 

టీ మీడియా ,అక్టోబర్ 29, ఆళ్లపల్లి :మర్కోడు గ్రామంలో శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలు, ఆధ్యాత్మిక ఉత్సాహం మధ్య వైభవంగా నిర్వహించబడుతున్నాయి. ఈ పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకుని గ్రామంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శ్రీ కనకదుర్గమ్మ కుంకుమ పూజ కార్యక్రమంలో మహిళలు అత్యంత ఉత్సాహంతో, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
​ఉదయం నుంచే ఆలయ ప్రాంగణం వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాలు, అమ్మవారి నామస్మరణలతో మారుమోగింది. సాంప్రదాయ దుస్తులు ధరించిన మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి, జగన్మాత కనకదుర్గమ్మకు ప్రత్యేక కుంకుమార్చనలు సమర్పించారు. లోక కళ్యాణార్థం, గ్రామాభివృద్ధి, కుటుంబ సౌభాగ్యం మరియు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుతూ భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఊరిలోని ప్రతీ వీధి నుండి మహిళలు భక్తిప్రపత్తులతో తరలివచ్చి కుంకుమ పూజలో పాల్గొని తమ భక్తిని చాటుకున్నారు.పండితుల ఆధ్వర్యంలో వేద మంత్రాల నడుమ పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా సాగాయి.పూజా అనంతరం పాల్గొన్న భక్తులందరికీ ఆలయ కమిటీ నిర్వాహకులు తీర్థ ప్రసాదాలు మరియు అన్నదానం ఏర్పాటు చేశారు.​ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ... అమ్మవారి దివ్య ఆశీస్సులు మర్కోడు గ్రామానికి, గ్రామస్తులందరికీ ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన గ్రామ మహిళలకు, సహకరించిన గ్రామ పెద్దలకు, భక్తులకు కమిటీ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు

Tags: