Telangana

Inauguration of various development initiatives in Garidegaon village Foundation stones laid by the Narayankhed Member of the Legislative Assembly (MLA)

Inauguration of various development initiatives in Garidegaon village Foundation stones laid by the Narayankhed Member of the Legislative Assembly (MLA)

By ·

Share this article
Inauguration of various development initiatives in Garidegaon village  Foundation stones laid by the Narayankhed Member of the Legislative Assembly (MLA)

 

గరిడేగావ్ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం 

శంకుస్థాపన చేసిన నారాయణఖేడ్ శాసనసభ్యులు

 

టీ మీడియా అక్టోబర్ 29 నారాయణఖేడ్ : సిర్గాపూర్ మండల పరిధిలోని గరిడేగావ్ గ్రామంలో గురువారం నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధుల ద్వారా రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. అలాగే రూ.10 లక్షల వ్యయంతో నిర్మించనున్న మహిళా సమైక్య భవనానికి భూమిపూజ నిర్వహించారు. అనంతరం గ్రామానికి చెందిన రాదవ్వ భర్త నర్సు గోండ ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమిపూజ చేశారు. తదుపరి గ్రామంలో ఏర్పాటు చేసిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి మాట్లాడుతూ.. గరిడేగావ్ గ్రామానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని, గ్రామ ప్రజలకు ఏ అవసరం వచ్చినా తన వంతు సహకారం అందిస్తూ గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. గ్రామంలో పెద్ద సంఖ్యలో యువత ఉండటం సంతోషకరమని, యువతను ప్రోత్సహిస్తూ వారికి తగిన అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమమే లక్ష్యంగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి పనులు చేపడుతోందని ఎమ్మెల్యే వివరించారు. ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు వివరించాలని సూచించారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో గ్రామాల అభివృద్ధిని పట్టించుకోలేదని విమర్శించిన ఎమ్మెల్యే, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులపై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. ప్రజలను రెచ్చగొట్టే రాజకీయాలు చేయడం కాకుండా, రైతులు మరియు సామాన్య ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రతిపక్ష నాయకులు కృషి చేయాలని సూచించారు.
అధికారం కోసం రాజకీయాలు చేయడం కంటే ప్రజల సంక్షేమం, రైతుల అభ్యున్నతి, గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారితో పాటు గ్రామ సర్పంచ్ నగేష్, యాదవ్ రెడ్డి మండల నాయకులు,రవీందర్ పాటిల్, నరేందర్,పండరి,శ్యామ్ ముదిరాజ్,వినోద్,పుల్ సింగ్ సర్పంచులు,మదుసుధాన్ మాజీ సర్పంచ్,జైరాజ్,వెంకట్ రావు, తదితర ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు గారిడే గావ్ గ్రామ యువకులు మహిళలు పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

 

 

 

 

Tags: