సైబర్ నేరాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి ఖేడ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్
టీ మీడియా, అక్టోబర్ 31, నారాయణఖేడ్ : ప్రతి ఒక్కరూ ఇంటర్నెట్ ఉపయోగించి సోషల్ మీడియాను బాగా వాడుతున్నారని అందులో కూడా విద్యార్థులు ఎంతగానో ఉపయోగిస్తున్నందున వారందరూ సైబర్ క్రైమ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని నారాయణ ఖేడ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీశైలం అన్నారు. శనివారం నాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నారాయణఖేడ్ లో ఏర్పాటు చేసిన సైబర్ భద్రత సురక్షిత ఇంటర్నెట్ సురక్షిత విద్యార్థి అనే అంశంపై వారు మాట్లాడుతు ప్రతి ఒక్కరూ ఆండ్రాయిడ్ సెల్ వాడుతున్నందున ప్రస్తుతం ఏపీకే ఫైల్ లాంటివి అనేకం వస్తున్నాయని వాటిని ఓపెన్ చేయకుండా జాగ్రత్తపడాలన్నారు . అదేవిధంగా సైబర్ మోసగాళ్లు వివిధ రకాలుగా కాల్స్ చేసి అందర్నీ ఇబ్బందులు గురి చేస్తున్నారని దీని పట్ల కూడా జాగ్రత్త ఉండాలన్నారు. ప్రస్తుతం విద్యార్థులను కానీ మహిళలు కానీ ఎవరైనా వేధిస్తే ఫోక్సో చట్టం అమలు ఉందని విద్యార్థులు భయపడకుండా తమకు ఎవరైనా ఇబ్బందులు గురి చేస్తే చెప్పాలన్నారు . ఎవరికైనా ఎలాంటి సహాయం అవసరం ఉన్న 100 కు కాల్ చేయాలని , సైబర్ క్రైమ్ కు గురైతే 1930 కు కాల్ చేసి వివరాలను చెప్పాలని వారి వివరాలను గోప్యంగా ఉంచుతమన్నారు . ఈ కార్యక్రమంలో ఇన్చార్జి హెచ్ఎం యాదగిరి, ఉపాధ్యాయులు సునంద, బసమ్మ, అశోక్ గౌడ్ చంద్రశేఖర్, సంగ్రామ్, భరోసా సభ్యులు నర్సింలు తదితరులు పాల్గొన్నారు






