Hyderabad

Unabated Corruption Among 'Police' No Change in Conduct Despite ACB Raids

Unabated Corruption Among 'Police' No Change in Conduct Despite ACB Raids

By ·

Share this article
Unabated Corruption Among 'Police'  No Change in Conduct Despite ACB Raids

 

 

ఆగని 'పోలీసుల' అవినీతి                                                                            

ఏసీబీ దాడులు జరుగుతున్నా మారని తీరు
   
 
 టీమీడియా , నవంబర్10 ,  హైదరాబాద్ బ్యూరో:  హైదరాబాద్ నగర పోలీస్ శాఖలో అవినీతి, అక్రమాలు, లైంగిక వేధింపుల ఘటనలు ప్రతి నెలా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇవి పోలీసు శాఖ పరువు, ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ఏసీబీ దాడులు, సస్పెన్షన్లు లంచం తీసుకుంటూ పట్టుబడిన అధికారులను ఏసీబీ అరెస్టు చేసి జైలుకు పంపుతున్నా, ఉన్నతాధికారులు సస్పెండ్ లేదా బహిష్కరణ వంటి కఠిన చర్యలు తీసుకుంటున్నా అక్రమ వసూళ్లకు అడ్డుకట్ట పడటం లేదు.

ఇటీవల కీసర పోలీస్ స్టేషన్‌లో అనీషా వద్ద రూ. 2 లక్షల లంచం తీసుకుంటుండగా ఒక ఎస్ఐ పట్టుబడ్డాడు. ఈ కేసులో అరెస్టయిన నిందితుడికి అనుకూలంగా ఛార్జిషీట్ దాఖలు చేస్తానని బెదిరించి అతను లంచం తీసుకున్నాడు.సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కానిస్టేబుళ్లు, హోంగార్డ్ స్వాధీనం చేసుకున్న బండిని తిరిగి ఇవ్వడానికి లంచాలు తీసుకున్నారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి రావడంతో అదే పోలీస్​స్టేషన్‌లో వారిపై కేసు నమోదైంది.
పోలీసు శాఖలో సిబ్బందిపై నిఘా ఎక్కువ

ఇతర శాఖలతో పోలిస్తే, పోలీసు శాఖలోనే సిబ్బందిపై ఎక్కువ నిఘా ఉంటుంది. ఫిర్యాదు అందినట్లయితే స్పెషల్ బ్రాంచ్‌తో దర్యాప్తు కొనసాగుతుంది. విధి నిర్వహణలో నిర్లక్ష్యానికి ఛార్జ్ మెమోలు, బదిలీలు, సస్పెన్షన్ వేటు తరచుగా జరుగుతూ ఉంటాయి. సెప్టెంబర్ రెండోవారం నుంచి ఇప్పటి వరకు ఆరుగురిని ఏసీబీ పట్టుకుంది.

ఇటీవలి కాలంలో జరిగిన ఘటనలు ఇవే 
సెప్టెంబర్ 16న ఒక కేసులో నిందితుడి నుంచి రూ. 5 లక్షల లంచం తీసుకుంటుండగా కీసర సీఐ ఆంజనేయులు, ఎస్ఐ జ్ఞానేందర్ రెడ్డిలను అనిశా పట్టుకుంది.
అక్టోబర్ 27న, రూ. 3 లక్షల లంచం తీసుకుంటుండగా మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ సీఐ, కానిస్టేబుల్‌ను ఏసీబీ పట్టుకుంది.
కీసర ఎస్ఐ రూ. 2 లక్షల లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డాడు. ఈ ఒక్క సంవత్సరంలోనే మూడు కేసులలో కీసర పోలీస్ స్టేషన్‌కు చెందిన నలుగురిని ఏసీబీ పట్టుకుంది.
లైంగిక వేధింపుల కేసులో జూబ్లీహిల్స్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసులు రెడ్డి, ఖైరతాబాద్ డీఐ బాలస్వామిల పేర్లు వెలుగులోకి వచ్చాయి.
విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు జూబ్లీ హిల్స్ ఇన్‌స్పెక్టర్ ముత్తు యాదవ్ బాధ్యతలు స్వీకరించిన మూడు వారాలలోపే సస్పెండ్ అయ్యారు.ఆగస్టులో చందానగర్ సబ్-ఇన్‌స్పెక్టర్ బాలరాజు ఒక కానిస్టేబుల్ రూ. 75,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీకి పట్టుబడ్డారు.

Tags: