ఢిల్లీ

23 death sentences in 6 months... - Judge transferred

By ·

Share this article
23 death sentences in 6 months...  - Judge transferred

 

6 నెలల్లో 23 మరణశిక్షలు..                                                                        

 జడ్జి బదిలీ 

 

టీమీడియా , అక్టోబర్ 26 , ఢిల్లీ బ్యూరో : ఉత్తరప్రదేశ్‌లోని ముజుఫర్‌నగర్‌, బరేలీలోని తన పోస్టింగ్‌ల కాలంలో మొత్తం 36 మరణశిక్షలు విధించిన జడ్జి రవికుమార్‌ దివాకర్‌ను ముజఫర్‌నగర్‌లోని ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు నుంచి ఫ్యామిలీ కోర్టుకు బదిలీ చేశారు. తాజా ఉత్తర్వు ద్వారా ఆయనను కుటుంబ కోర్టు అదనపు ప్రిన్సిపల్‌ జడ్డిగా నియమించారు.

హైప్రొఫైల్‌ క్రిమినల్‌ తీర్పులు, పెండింగ్‌ కేసుల ఉపసంహరణపై తలెత్తిన ప్రశ్నల నడుమ ఈ బదిలీ ప్రాధాన్యత సంతరించుకుంది. ‘ది ఎకనమిక్‌ టైమ్స్‌’ నివేదిక ప్రకారం ముజఫర్‌నగర్‌లో 2026 ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ మధ్యకాలంలో ఆయన 11 కేసుల్లో 23 మరణ శిక్షలు విధించారు. అంతకుముందు బరేలీలో కూడా ఆయన 13 మరణశిక్షలు ఖరారు చేశారు.

Tags: