సామాన్యుడిపై మరో పిడుగు..
పెరగనున్న సబ్బులు,
వంటనూనెల ధరలు
టీమీడియా , అక్టోబర్ 26 , ఢిల్లీ బ్యూరో : ఇప్పటికే బియ్యం, పప్పులు, గ్యాస్, పెట్రోల్ ధరల పెంపుతో ఇబ్బంది పడుతున్న సామాన్యుడిపై మరో పిడుగు పడనుంది. త్వరలోనే సబ్బులు, టూత్‌పేస్ట్‌లు, వంటనూనెలు, చాక్లెట్ల వంటి ధరలు పెరగనున్నాయి. క్రూడ్ చమురు ధరలు పెరగడంతో ముడిసరుకుల ధరలు 74 శాతం వరకు పెరగడమే కాక, బలహీనమైన వర్షపాతం నమోదుతో పలు పంట ఉత్పత్తులు తగ్గడంతో ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను పెంచేందుకు నిర్ణయించాయి.
చమురు ధరలు బ్యారెల్‌కు 113 డాలర్లకు చేరడంతో ఉత్పత్తి వ్యయాలపై దాని ప్రభావం గణనీయంగా పడిందని క్రైసిల్, ఎలరా క్యాపిటల్, కొటక్ నియో సంస్థల విశ్లేషకులు పేర్కొన్నారు. డిసెంబర్ నుంచి టెలిఫోన్ బిల్లులు పెరగనున్నట్టు అంబిత్ క్యాపిటల్ అంచనా వేసింది.



