karepalli khammam district

Bhatti must resign The CP must be transferred

Bhatti must resign The CP must be transferred

By ·

Share this article
Bhatti must resign  The CP must be transferred

 

భట్టి రాజీనామా చేయాలి

సీపీని బదిలీ చేయాలి

సామినేని హత్య కేసుపై సీపీఎం ఆగ్రహం

సిట్‌తో విచారణ జరిపించాలని డిమాండ్

కారేపల్లి లో భట్టి,సీపీ దిష్టిబొమ్మల దగ్ధం

టీ మీడియా,అక్టోబర్30,సింగరేణి(కారేపల్లి):సీపీఎం సీనియర్ నాయకుడు,ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,పాతర్లపాడు మాజీ సర్పంచ్ కామ్రేడ్ సామినేని రామారావు హత్య కేసులో నిజమైన నిందితులను పట్టుకోకుండా విచారణను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపిస్తూ సీపీఎం సింగరేణి మండల కమిటీ శుక్రవారం ఆందోళన చేపట్టింది.ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,ఖమ్మం పోలీస్ కమిషనర్ దిష్టిబొమ్మలను దగ్ధం చేసి నిరసన తెలిపింది.సీపీఎం సింగరేణి మండల కార్యదర్శి కె.నరేంద్ర అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు కొండబోయిన నాగేశ్వరరావు మాట్లాడుతూ.. హత్య కేసుతో సంబంధం లేని వారిని అరెస్టు చేసి అసలు నిందితులను తప్పించే ప్రయత్నం జరుగుతోందని తీవ్రంగా ఆరోపించారు.కేసు విచారణపై అనేక అనుమానాలు ఉన్నందున ప్రస్తుత పోలీస్ కమిషనర్‌ను బదిలీ చేసి,ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)తో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.హత్య జరిగి ఏడాది కావస్తున్నా అసలు కుట్ర,దాని వెనుక ఉన్న వ్యక్తుల పాత్రను వెలికితీయడంలో పోలీసు వ్యవస్థ విఫలమైందని విమర్శించారు. ‘‘కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు విచారణ సాగుతోంది’’అంటూ ఎద్దేవా చేశారు.రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి కేసును పక్కదారి పట్టిస్తున్నారనే అనుమానాలకు పోలీసుల తీరు తావిస్తోందని ఆరోపించారు.అధికారాన్ని అడ్డుపెట్టుకుని చట్టాన్ని దుర్వినియోగం చేస్తే దానిని ప్రజాపాలనగా ఎలా చెప్పగలరని ప్రశ్నించారు.హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారంటూ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కపై తీవ్ర ఆరోపణలు చేసిన ఆయన,నైతిక బాధ్యత వహిస్తూ భట్టి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
*‘‘సీపీని బదిలీ చేయాలి..*అసలు నిందితులను బయటపెట్టాలి..*
సామినేని రామారావు హత్య వెనుక నిజాలను ప్రజల ముందుంచాలి’’ అని నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.లేనిపక్షంలో ఆందోళనలను మరింత ఉధృతం చేసి ప్రభుత్వ వైఖరిని ప్రజల్లో ఎండగడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సీపీఎం సీనియర్ నాయకుడు ముక్క సీతారాములు,కార్యదర్శివర్గ సభ్యుడు రేకల మంగయ్య,మండల కమిటీ సభ్యులు ముండ్ల ఏకాంబరం,శ్రీరాములు,తిరపయ్య,సైదులు,కోటయ్య,సంపత్,మంద శ్రీను, బాబు తదితరులు పాల్గొన్నారు.

Tags: