నిర్మల్

Deeply distressed due to family conflicts... Woman jumps from a building

Deeply distressed due to family conflicts... Woman jumps from a building

By ·

Share this article
Deeply distressed due to family conflicts...   Woman jumps from a building

 

 

 

కుటుంబ కలహాలతో తీవ్ర మనస్తాపం..

భవనంపై నుంచి దూకిన మహిళ
 


  టీమీడియా , నవంబర్ 19, నిర్మల్ : కుటుంబ కలహాలతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ వివాహిత ఐదంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. నిర్మల్ జిల్లా కేంద్రంలోని శివాజీ చౌక్ వద్ద బుధవారం చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

కరీంనగర్ జిల్లాకు చెందిన ప్రవళిక అలియాస్ సంగీతకు నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం నేతాజీనగర్‌కు చెందిన రవితో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. రవి ప్రభుత్వ గురుకుల కళాశాలలో గెస్ట్ లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

గతంలోనూ ఆత్మహత్యాయత్నం
కుటుంబంలో తరచూ గొడవలు జరుగుతుండటంతో కొద్దిరోజుల క్రితం ప్రవళిక శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో దూకి ఆత్మహత్యాయత్నం చేసినట్లు సమాచారం. భర్త పోలీసులకు సమాచారం అందించడంతో ఫోన్ లొకేషన్ ఆధారంగా ఆమెను గుర్తించి కాపాడారు. అనంతరం కూడా కుటుంబ కలహాలు కొనసాగడంతో ఆమె సారంగాపూర్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు దంపతులకు కౌన్సెలింగ్ ఇప్పించేందుకు నిర్మల్‌లోని సఖి కేంద్రానికి పంపించారు.

కాపాడేందుకు ప్రయత్నిస్తుండగా దూకేసిన మహిళ
బుధవారం దంపతులు మరోసారి కౌన్సెలింగ్ కోసం సఖి కేంద్రానికి వెళ్లగా అక్కడ మళ్లీ గొడవ జరిగినట్లు తెలుస్తోంది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ప్రవళిక శివాజీ చౌక్ వద్ద నిర్మాణంలో ఉన్న ఐదంతస్తుల భవనం పైకి ఎక్కింది. తల్లి, పిల్లలు, స్థానికులు కిందకు రావాలని ఎంతగా వేడుకున్నా ఆమె వినలేదు.

సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని ఆమెను కాపాడేందుకు ప్రయత్నించారు. ఇదే సమయంలో ఇద్దరు వ్యక్తులు రహస్యంగా భవనంపైకి చేరుకుని ఆమెను పట్టుకునేందుకు ప్రయత్నించగా, వారిని గమనించిన ప్రవళిక ఒక్కసారిగా కిందకు దూకింది.

పరిస్థితి విషమం.. రిమ్స్‌కు తరలింపు
మహిళను కాపాడేందుకు కింద ఏర్పాటు చేసిన సేఫ్టీ నెట్‌ ప్రయత్నం ఫలించలేదు. ఈ ఘటనలో ఆమె రెండు కాళ్లు, ఒక చేయి విరగడంతో పాటు తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే 108 అంబులెన్స్‌లో నిర్మల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.

మహిళ భవనంపై నుంచి దూకుతున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరోవైపు, అత్తింటివారి వేధింపుల కారణంగానే తన కుమార్తె ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని బాధితురాలి తల్లి ఆరోపించారు. ఈ ఆరోపణలపై అధికారిక విచారణలో వాస్తవాలు వెలుగులోకి రావాల్సి ఉంది.

Tags: