andrapredesh

Destroyed by the impact of the *murasu* (drum/heavy percussion instrument) Vijayawada-Amaravati Road

Destroyed by the impact of the *murasu* (drum/heavy percussion instrument) Vijayawada-Amaravati Road

By ·

Share this article
Destroyed by the impact of the *murasu* (drum/heavy percussion instrument)  Vijayawada-Amaravati Road

 

 

మురసు దెబ్బకు ధ్వంసమైన                                                                                                             

విజయవాడ-అమరావతి రోడ్డు  
 

టీమీడియా , నవంబర్ 17, అమరావతి బ్యూరో : పంచారామ క్షేత్రాల్లో ప్రథమారామమైన అమరావతి అమరేశ్వరుని దర్శనానికి వెళ్లాలంటే భక్తులకు ప్రాణసంకటమే ఎదురవుతోంది. రాజధాని అమరావతి, విజయవాడతో పాటు పల్నాడు ప్రాంతాన్ని అనుసంధానించే కీలక రహదారి మురసు తుపాను దెబ్బకు ఛిద్రమైంది. భారీ వర్షాలకు పెదమద్దూరు వద్ద నూతన వంతెన నిర్మాణ లోపంతో రహదారి కోతకు గురైంది. అమరావతి-విజయవాడ ఆర్టీసీ బస్సు సర్వీసులు పెదమద్దూరు వద్ద నిలిపివేస్తుండటంతో భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

కార్తిక మాసంలో అమరేశ్వరుడి దర్శనానికి వెళ్లే భక్తులకు విజయవాడ-అమరావతి రహదారి చుక్కలు చూపిస్తోంది. మురసు తుపాను దెబ్బకు పెదమద్దూరు వద్ద రహదారి భారీగా కోతకు గురై ప్రమాదకరంగా మారింది. వరద ఉద్ధృతికి రోడ్డు పక్కన మట్టి కొట్టుకుపోవడంతో పాటు ఏకంగా రహదారే కుంగిపోయింది. రహదారి అంచులు కోతకు గురవడంతో ఒక వాహనం మాత్రమే వెళ్లేంత ఇరుకుగా మారింది. నిత్యం వందలాది వాహనాలు సెలవు రోజుల్లో ప్రత్యేక బస్సులతో రద్దీగా ఉండే ఈ మార్గంలో ఇప్పుడు అడుగడుగు ప్రమాదకరంగా తయారైంది. రాత్రివేళ ప్రయాణమంటేనే వాహనదారులు హడలిపోతున్నారు. రోడ్డు అధ్వానంగా తయారవటంతో ఆర్టీసీ బస్సులను పెదమద్దూరు వరకే పరిమితం చేశారు. దీంతో అమరేశ్వరుడి దర్శనానికి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
 
పెదమద్దూరు వద్ద రూ.10 కోట్లు ఖర్చు చేసి నిర్మించిన హైలెవల్‌ బ్రిడ్జి ఉన్నా రహదారికి వరద ముప్పు తప్పడం లేదు. వాగు మలుపు తిరిగే ప్రాంతం వరకు వంతెన నిర్మించాల్సి ఉండగా, ముందుగానే పనులు ముగించడంతో వరద ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయని స్థానికులు విమర్శిస్తున్నారు. రెండు నెలల క్రితం ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వరదతో పంట పొలాలు, రహదారి కోతకు గురయ్యాయని తాజాగా మురసు తుపాను దెబ్బకు రోడ్డు భారీగా ధ్వంసమైందని చెబుతున్నారు. వంతెన నిర్మాణ లోపాలపై అధికారులు దృష్టి సారించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Tags: