ఉద్ధాలు పెట్టే చాట పూజ లో పాల్గొన్న దేవరకద్ర ఎమ్మెల్యే
టి మీడియా, నవంబర్ 16,చిన్నచింతకుంట : మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండలంలోని అమ్మాపూర్ గ్రామ సమీపాని వెలసిన శ్రీ.శ్రీ.శ్రీ. కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా అత్యంత కీలక ఘట్టం సోమవారం ఉద్దాల మహోత్సవం.
ఇట్టి ఉద్దాల మహోత్సవంలో ఉదయం చిన్నచింతకుంట మండలం పల్లమర్రి గ్రామంలో స్వామివారి ఉద్దాల చాట కు నిర్వహించే ప్రత్యేక పూజ లు నిర్వహించారు. ఈ చాటలోనే వడ్డేమాన్ గ్రామంలో ఉద్దాల మండపంలో తయారైన ఉద్దాలని ఈ చాటలో పెట్టి ప్రత్యేక పూజలు జరిపి కురుమూర్తి దేవస్థానానికి చేరుస్తారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి తో పాటు చిన్న చింతకుంట మండలం నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు
