ఇళ్లను నిజమైన లబ్ధిదారులకు ఇవ్వాలి
- అఖిలపక్ష పార్టీ నాయకులు
టీ మీడియా ,అక్టోబర్ 21, తిరుమలాయపాలెం:తిరుమలాయపాలెం పరిధిలో ని ఇందిరమ్మ ఇళ్ల పథకంలో నిజమైన నిరుపేద లబ్ధిదారులకు న్యాయం చేయాలని, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇల్లు మంజూరు చేయాలని బీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ, సిపిఐ (ఎంఎల్) ప్రజాపంథా పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌తో రేపు కలెక్టర్ కార్యాలయం ఎదుట నిర్వహించనున్న ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు ప్రజలకు పిలుపునిచ్చారు.
బచ్చోడు గ్రామంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో రాజకీయ పక్షపాతం లేకుండా నిజమైన అర్హులను గుర్తించి ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. ఇళ్లు లేని నిరుపేద కుటుంబాలు ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్నప్పటికీ, అర్హులైన వారికి న్యాయం జరగకపోవడం ఆందోళనకరమని అన్నారు.




