రైతుల సాగునీటి హక్కులకు ప్రాధాన్యం ఇవ్వాలి
బిజెపి ఇన్చార్జి కొండా ప్రశాంత్ రెడ్డి
టీ మీడియా, నవంబర్ 20 ,దేవరకద్ర : కోయిల్‌సాగర్ ప్రాజెక్టు నీటిని జ కొడంగల్‌కు తరలించే ప్రతిపాదనలపై దేవరకద్ర బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కొండ ప్రశాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు విలేకరుల సమావేశంలో పలు ప్రశ్నలు లేవనెత్తారు. బీజేపీ నాయకులు అను అంశాలను ప్రస్తావిస్తూ ప్రస్తావించిన రైతుల కోసం నిర్మించిన ప్రాజెక్టు
కోయిల్‌సాగర్ ప్రాజెక్టును ఈ ప్రాంత రైతుల సాగునీటి అవసరాల కోసం నిర్మించారు. అలాంటి ప్రాజెక్టు నుంచి కొడంగల్‌కు రోజుకు 4 కోట్ల లీటర్ల నీటిని తరలించే ప్రతిపాదన స్థానిక రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది? తగ్గుతున్న నీటి నిల్వలు ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 2.276 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 1.15 టీఎంసీల నీరు మాత్రమే ఉందని పేర్కొన్నారు. గతేడాదితో పోలిస్తే 0.95 టీఎంసీల నిల్వ తగ్గిందని, అసలు ఆయకట్టుకే పూర్తిస్థాయిలో నీరందడం లేదు ప్రాజెక్టు అసలు ఆయకట్టు 12 వేల ఎకరాలు కాగా, సగటున 5 వేల ఎకరాలకే సాగునీరు అందుతోందని అధికారిక గణాంకాలను ప్రస్తావించారు. విస్తరణ ఆయకట్టు లక్ష్యం ఏమైంది? కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకం ద్వారా 50,250 ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యం ఉంది. ఆ లక్ష్యం ఎంతవరకు నెరవేరిందో ప్రభుత్వం వెల్లడించాలని ప్రశ్నించారు. ఏడాదికి 0.516 టీఎంసీల నీరు అవసరం రోజుకు 40 ఎంఎల్‌డీల నీటిని తరలిస్తే ఏడాదికి సుమారు 0.516 టీఎంసీల నీరు అవసరమవుతుంది. ప్రస్తుతం ఉన్న నీటి నిల్వల దృష్ట్యా ఈ నీటిని ఏ వనరు నుంచి సమకూరుస్తారో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.పరిశ్రమలకు 15 ఎంఎల్‌డీలు కేటాయింపా?
ప్రతిపాదిత 40 ఎంఎల్‌డీలలో 15 ఎంఎల్‌డీలను లగచర్ల పారిశ్రామిక కారిడార్‌కు కేటాయించినట్లు సమాచారం ఉందని పేర్కొన్నారు. రైతుల సాగునీటి అవసరాలకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో ప్రభుత్వం చెప్పాలని కోరారు.మిగిలిన 8 ఎంఎల్‌డీల వినియోగం ఎక్కడ? మొత్తం 40 ఎంఎల్‌డీలలో 32 ఎంఎల్‌డీల వినియోగ వివరాలే కనిపిస్తున్నాయని, మిగిలిన 8 ఎంఎల్‌డీలను ఎక్కడ వినియోగిస్తారో వెల్లడించాలని ప్రశ్నించారు.
ముందుగా స్థానిక సమస్యలు పరిష్కరించాలి
ప్రాజెక్టులో పూడికతీత, కాలువల ఆధునికీకరణ, చివరి ఆయకట్టుకు నీటి సరఫరా వంటి సమస్యలను పరిష్కరించకుండా కొత్తగా నీటి తరలింపు చేపట్టడం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు.
అభివృద్ధికి వ్యతిరేకం కాదు.. రైతుల ప్రయోజనాలే ముఖ్యం
పట్టణాలకు తాగునీరు అందించడం, పరిశ్రమల అభివృద్ధిని ఎవరూ వ్యతిరేకించడం లేదని, అయితే వాటి కోసం స్థానిక రైతుల సాగునీటి ప్రయోజనాలు దెబ్బతినకూడదని స్పష్టం చేశారు.అధికారిక అనుమతులు ఉన్నాయా?
నీటిపారుదల శాఖ అనుమతులు తీసుకున్నారా? నీటి కేటాయింపులపై అధికారిక ఉత్తర్వులు ఉన్నాయా? నీటి లభ్యతపై సాంకేతిక నివేదిక రూపొందించారా? అనే అంశాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరార.ప్రభుత్వానికి బీజేపీ సంధిస్తున్న ముఖ్యమైన ప్రశ్నలు సంధించారు. వీటికి తప్పనిసరిగా జవాబు చెప్పాలని కోరారు. కోయిల్‌సాగర్ నుంచి కొడంగల్‌కు నీటిని తరలించేందుకు అధికారిక నీటి కేటాయింపు ఉత్తర్వులు ఎక్కడ ఉన్నాయి?స్థానిక ఆయకట్టు అవసరాలు తీరిన తర్వాతే ఇతర ప్రాంతాలకు నీటిని తరలిస్తామని ప్రభుత్వం హామీ ఇస్తుందా?లగచర్ల పరిశ్రమలకు 15 ఎంఎల్‌డీలు కేటాయిస్తే స్థానిక రైతులకు ఎంత నీరు అందుబాటులో ఉంటుంది
ఈ కార్యక్రమంలో దేవరకద్ర మండల అధ్యక్షుడు కృష్ణంరాజు,బిజెపి రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ యజ్ఞభూపాల్ రెడ్డి, జిల్లా కార్యదర్శి నారాయణరెడ్డి, ఓబీసీ కార్యవర్గ సభ్యులు దేవన్నసాగర్, స్థానిక బిజెపి కౌన్సిలర్ ఉమారాజ్, ముఖ్య నాయకులు, ముఖ్య కార్యకర్తలు, పాల్గొన్నారు

