aswapuram

Launch of the 'Indiramma Life Insurance Scheme' Registration Program Initiated by Sarpanch Banoth Sadar Lal

Launch of the 'Indiramma Life Insurance Scheme' Registration Program Initiated by Sarpanch Banoth Sadar Lal

By ·

Share this article
Launch of the 'Indiramma Life Insurance Scheme' Registration Program  Initiated by Sarpanch Banoth Sadar Lal

 

ఇందిరమ్మజీవిత బీమా పథకం నమోదు కార్యక్రమం ప్రారంభం*


 ప్రారంభించిన సర్పంచ్ బానోత్ సదర్ లాల్


టీ మీడియా,నవంబర్ 20,అశ్వాపురం: అశ్వాపురం గ్రామపంచాయతీ కార్యాలయంలో ఈరోజు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక సర్పంచ్ శ్రీ బానోత్ సదర్ లాల్ రిబ్బన్ కటింగ్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎంపీడీవో  ముత్యాలరావు  పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సర్పంచ్ బానోత్ సదర్ లాల్  మాట్లాడుతూ, పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రేషన్ కార్డు కలిగిన ప్రత్యేక కుటుంబాలు ఈ పథకానికి అర్హులని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

కుటుంబంలో సంపాదించే వ్యక్తికి ఏదైనా అనుకోని ప్రమాదం లేదా మరణం సంభవించినప్పుడు, ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులకు గురికాకుండా వెనుక ఉన్న కుటుంబ సభ్యులకు ఆర్థిక భరోసా కల్పించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఇటువంటి జీవిత బీమా పథకాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు.

ప్రతి అర్హులైన కుటుంబం ఈ పథకంపై అవగాహన కలిగి ఉండాలని, నమోదు ప్రక్రియను సకాలంలో పూర్తి చేసుకోవాలని సూచించారు. గ్రామంలోని ప్రజలందరికీ ఈ పథకంపై అవగాహన కల్పించడంతో పాటు, అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకం అందేలా గ్రామపంచాయతీ తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ శ్రీ తుళ్లూరి ప్రకాశరావు, వార్డు సభ్యులు వేములపల్లి హసిత, కోర్స ముత్తమ్మ, చింతల అనుపమ, చెట్టుపల్లి రమాదేవి, గ్రామపంచాయతీ సిబ్బంది మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Tags: