Telangana

Mahatma Jyotiba Phule is an inspiration to everyone. PRTU State General Secretary: Katta

Mahatma Jyotiba Phule is an inspiration to everyone. PRTU State General Secretary: Katta

By ·

Share this article
Mahatma Jyotiba Phule is an inspiration to everyone.    PRTU State General Secretary: Katta

 

 

మహాత్మా  జ్యోతిబా పూలే అందరికీ  ఆదర్శం.

 

పి ఆర్ టి యు  రాష్ట్ర ప్రధాన  కార్యదర్శి : కట్ట 

 


 
టీ మీడియా, నవంబర్ 16, కూసుమంచి : సమాజంలో విద్య ద్వారానే సమానత్వం, సామాజిక చైతన్యం సాధ్యమని చాటి చెప్పిన మహనీయులు మహాత్మ జ్యోతిబా పూలే ఆశయాలు అందరికీ ఆదర్శమని పి ఆర్ టి యు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్ట శేఖర్ పేర్కొన్నారు. మండల కేంద్రం కూసుమంచి లోని పూలే విగ్రహానికి ఆయన పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శేఖర్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిబా పూలే సామాజిక సంస్కరణలు, విద్యా వ్యాప్తి, సమానత్వం, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం చేసిన విశేష కృషిని స్మరించారు. 
ఘన స్వాగతం : పి ఆర్ టి యు  టిఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై, తొలిసారిగా ఖమ్మం జిల్లాకు విచ్చేసిన కట్ట శేఖర్ కి జిల్లా సరిహద్దు నాయకన్ గూడెం వద్ద పి ఆర్ టి యు నాయకులు, ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులు పూలమాలతో ఘన స్వాగతం పలికి, సాధరoగా ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో పి ఆర్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్. రంగారావు, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు విజయ్ అమృత్ కుమార్, రత్న కుమార్, పి ఆర్ టి యు కూసుమంచి మండల అధ్యక్షులు శీలం ఆంజనేయులు, జిల్లా ఉపాధ్యక్షులు సతీష్, టి. చంద్రశేఖర్, సోమ్లా,  పి ఆర్ టి యు మాసపత్రిక ఎడిటోరియల్ సభ్యులు జి.వి. రమణ, పి ఆర్ టి యు  నాయకులు  ఏ. లక్ష్మీనారాయణ, సిహెచ్ మురళీమోహన్, నాయకులు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొని  తెలంగాణ రాష్ట్ర నూతన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గా ఎన్నికైన కట్ట శేఖర్ కి శుభాకాంక్షలు తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి  పి ఆర్ టి యు  టీఎస్  మరింత బలుపేతం కావాలని నాయకులు ఆకాంక్షించారు.

 

 

 

 

 

Tags: