hyderabad

Telugu female student goes missing in America.. Search operation continues for 8 days

Telugu female student goes missing in America.. Search operation continues for 8 days

By ·

Share this article
Telugu female student goes missing in America..  Search operation continues for 8 days

 

అమెరికాలో తెలుగు విద్యార్థిని అదృశ్యం..                                                            

8 రోజులుగా కొనసాగుతున్న గాలింపు   
 

 టీ మీడియా,నవంబర్12,  హైదరాబాద్ బ్యూరో  : అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ మసాచుసెట్స్‌(యూమాస్‌) బోస్టన్‌ విద్యార్థిని కోయ శ్రీజారెడ్డి అదృశ్యమై నేటికి ఎనిమిది రోజులు గడుస్తున్న తరుణంలో, ఆమెను సురక్షితంగా వెనకి తీసుకువచ్చేందుకు అన్నిరకాల ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) కోఆర్డినేటర్‌ సొంపల్లి కృష్ణప్రసాద్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

నవంబర్‌ 2 నుంచి కనిపించకుండా పోయిన శ్రీజారెడ్డి కేసులో మొదటి రోజు నుంచే బోస్టన్‌ పోలీస్‌ విభాగం, విశ్వవిద్యాలయ అధికారులతో సమన్వయం చేసుకుంటూ గాలింపు చర్యలను పర్యవేక్షిస్తున్నట్టు ఆయన పేరొన్నారు. భారత కాన్సులేట్‌తో పాటు రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చొరవ తీసుకుని మసాచుసెట్స్‌ రాష్ట్ర ఉన్నతాధికారులు, భారత విదేశాంగ మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరుపుతున్నారని వివరించారు.

Tags: